"బ్రో" మూవీ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ప్రస్తుతం "బ్రో" అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళ ప్రేక్షకులను ఎంత గానో అలరించినటువంటి వినోదయ సీతం అనే సినిమాకు అధికారిక తెలుగు రీమిక్ గా రూపొందుతుంది. ఈ సినిమా రీమిక్ అయినప్పటికీ ఈ మూవీ కథలో అనేక మార్పులు ... చేర్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ మూవీ కథను మార్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఒరిజినల్ లో ఈ సినిమాలో ఎలాంటి పాటలు ఉండవు. కాకపోతే ఈ సినిమాలో మాత్రం రెండు పాటలను పెట్టినట్లు తెలుస్తోంది.

ఆ రెండు పాటలు కూడా అద్భుతంగా వచ్చినట్లు సమాచారం. తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా యొక్క టైటిల్ ను విడుదల చేస్తూ ఈ మూవీ బృందం ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. దీనికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.  ఈ మూవీ ని జూలై 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కు సంబంధించిన షూటింగ్ బాగాన్ని ఈ మూవీ బృందం ముగించింది. సాయి తేజ్ కు సంబంధించిన కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ బృందం హైదరాబాద్ లో సాయి తేజ్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కానున్నట్లు. దానితో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈ మూవీ మేకర్స్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళం లో ఈ మూవీ ప్రేక్షకులను ఎంత గానో అలరించడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: