పవన్... ప్రభాస్... విశ్వక్... మూవీల షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి హీరోలు అయినా పవన్ , ప్రభాస్ , విశ్వక్ లు ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం వీరు ఏ సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నారు ... వాటి స్టేటస్ ఏమిటో తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ ... పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉంటాగా ... ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ యొక్క మొదటి షెడ్యూల్ ముంబై లో కొన్ని రోజుల క్రితమే పూర్తయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం పవన్ కళ్యాణ్ ... ప్రకాష్ రాజ్ మరియు ఇతరులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్దీ కుమార్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం ప్రభాస్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

విశ్వక్ సేన్ ప్రస్తుతం తన కెరియర్ లో 11 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విశ్వక్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

ఇలా ప్రస్తుతం ఈ మూడు మూవీ ల షూటింగ్ లు ఫుల్ స్పీడ్ గ జరుగుతున్నాయి. ఈ మూడు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: