"రంగబలి" మూవీ నుండి మొదటి సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ బృందం..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి నాగ శౌర్య ఆఖరుగా కృష్ణ వ్రిందా విహరి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో రంగబలి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.
 

ఈ మూవీ కి పవన్ బాసం శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం జూలై 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అలాగే తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను "సరిగమ" సంస్థ దక్కించుకున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా లోని మొదటి సాంగ్ విడుదల తేదీని ప్రకటించింది.

ఈ మూవీ లోని "మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది" అంటూ సాగే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను మే 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో నాగ శౌర్య అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ మూవీకి పవన్ సిహెచ్ సంగీతం అందించాడు. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: