ఆ హీరోతో ఐటమ్ సాంగ్.. నన్నెంతో బాధించింది : తమన్నా

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీల రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి వార్తల్లో కొన్ని నిజం అయితే మరికొన్ని మాత్రం కేవలం పుకార్లు గానే మిగిలిపోతూ ఉంటాయి. కాగా కొన్ని రోజుల నుంచి మిల్కీ బ్యూటీ తమన్న గురించి కూడా ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఎన్బికే 108 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది అన్న విషయం తెలిసిందే.

 ఇక ఈ సినిమాపై అభిమానుల్లో ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి.  అయితే వరుసగా సూపర్ హిట్ లు కొడుతూ జోరు మీద ఉన్న బాలయ్య అనిల్ రావిపూడి తో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని ఇక నందమూరి అభిమానులు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను సంప్రదించారని.. అయితే ఈ సాంగ్ చేయడానికి తమన్న కోటి రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఇటీవలే మిల్కీ బ్యూటీ తమన్న స్పందించింది. ఈ వార్తలు తనను ఎంతగానో బాధించాయి అంటూ చెప్పుకొచ్చింది.

 అనిల్ రావిపూడితో వర్క్ ని నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. ఇక బాలకృష్ణపై నాకెంతో గౌరవం కూడా ఉంది.  వాళ్ళ సినిమాలో నేను ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే ముందు దయచేసి రీసెర్చ్ చేసి తెలుసుకోండి అంటూ తమన్న సోషల్ మీడియా వేదిక స్పందించింది. దీంతో బాలయ్య సినిమాలో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది అంటూ జరుగుతున్న ప్రచారానికి తమన్న పుల్ స్టాప్ పెట్టినట్లు అయింది అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీ లీల, అర్జున్ రాంపాల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: