చిరంజీవి సినిమాకు కూడా తప్పని లీకుల బెడద..!!

Divya
చిరంజీవి నటించిన తాజా చిత్రాలలో భోళా శంకర్ సినిమా కూడ ఒకటీ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. తమిళంలో ఈ సినిమా వేదాళం అనే పేరుతో విడుదలయ్యింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమా తమిళంలో అజిత్ నటించగా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. అజిత్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో భోళా శంకర్ అనే పేరుతో రీమిక్స్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తోంది.

చిరంజీవికి చెల్లెలి పాత్రల కీర్తి సురేష్ కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.ఇప్పటికే చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.దీంతో భోళా శంకర్ చిత్రం పైన కూడా భారీగానే అంచనాలు నెలకొన్నాయి తాజాగా చిరంజీవి ఈ సినిమా నుంచి లీకులు బెడద తప్పడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలకు సంబంధించి పలు ఫోటోలు వీడియోలు కూడా లేక ఈ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

ఎన్నో జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ చేసుకుంటున్నప్పటికీ ఫోటోలు మాత్రం లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా చిరంజీవి భోళా శంకర్ చిత్రం నుంచి కూడా లీకులు బయటకి వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ కి సంబంధించి క్లిప్పు నెట్టింట వైరల్ గా మారుతోందని లీకైన క్లిప్పులో తమన్నా, చిరంజీవి కలిసి డాన్స్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారుతుంది యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరి ఈ చిత్రంతో చిరంజీవి మంచి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: