"బ్రో" మోషన్ పోస్టర్ కు ఆల్ టైమ్ రికార్డ్ వ్యూస్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించి అందులో ఎన్నో మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న పవన్ మళ్లీ వకీల్ సాబ్ మూవీ తో తిరిగి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా తాజాగా పవన్ తమిళ ప్రేక్షకులను ఎంత గానో అలరించినటు వంటి వినోదయ సీతం అనే తమిళ మూవీ ని తెలుగు లో రీమేక్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కి వినోదయ సీతం సినిమాకు దర్శకత్వం వహించినటు వంటి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇన్ని రోజుల పాటు ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క టైటిల్ ను ప్రకటిస్తూ ఒక మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మోస్ట్ అండ్ పోస్టర్ కు 24 గంటల సమయంలో ఆల్ టైమ్ రికార్డు వ్యూస్ లభించాయి. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు "బ్రో" అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలియజేస్తూ ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ కు 24 గంటల సమయం ముగిసే సరికి 5.83 మిలియన్ వ్యూస్ లభించాయి. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోని ఏ మోషన్ పోస్టర్ కు కూడా 24 గంటల్లో ఇన్ని వ్యూస్ లభించలేదు. ఈ మోషన్ పోస్టర్ కు 24 గంటల సమయంలో 126.2 కే లైక్స్ లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: