అబ్బో..రష్మిక ను ఇలా కూడా వాడేస్తున్నారా ?

praveen
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి... ఈ సామెత ను సినిమా ఇండస్ట్రీ ప్రతి రోజు నియం అని నిరూపిస్తూనే ఉంటుంది. వారికి వచ్చే చిన్న అవకాశమైనా, పెద్ద అవకాశం అయినా సరే గట్టిగానే డబ్బు వసూలు చేయాలని డిసైడ్ అయిపోయారు, అందుకే ఈ చిన్న కార్యక్రమానికి వచ్చిన, షాప్ ఓపెనింగ్ చేసిన, సినిమాలో నటించిన రెమ్యూనరేషన్ తో చుక్కలు చూపిస్తూ ఉంటారు. అయితే పక్క వారి సినిమాలను ప్రమోట్ చేయడం కూడా ఈ మధ్య పెద్ద బిజినెస్ అయిపోయింది.

 అందుకు రష్మిక మందన సైతం ఎలాంటి అతీతం కాదు. ఆమె ఇటీవల ఒక చిన్న సినిమాను ప్రమోట్ చేసింది. ఆ సినిమాలోని ఒక సాంగ్ విడుదల చేయడానికి ప్రోమో ను లాంచ్ చేసింది రష్మిక. ఒక చిన్న సినిమా కోసం రష్మిక ఇంతలా ఎందుకు ప్రమోషన్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. అయితే ఆ నిర్మాతలతో ఉన్న పరిచయంతో అలా చేసిందేమో అని అనుకున్నారు కానీ తెరవెనక విషయం మరోలా ఉంది.

ఆమె ఆ సినిమా ప్రమోషన్ చేయడానికి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతే కాదు ఆమె వేదిక దగ్గరికి వెళ్లడానికి ప్రయాణ ఖర్చులతో సహా హోటల్ రూమ్, ఆమె స్టాఫ్ కి సంబంధించిన పేమెంట్లు ప్రతి ఒక్కటి సదరు సినిమా నిర్మాత  భరించినట్టుగా తెలుస్తుంది. ఇలా ఒక చిన్న సినిమాను ప్రమోట్ చేయడం కోసం రష్మిక భారీ మొత్తం తీసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఇదంతా నానానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు రష్మిక మందన నేషనల్ క్రష్ అయినప్పటికీ ఆమెకు డౌన్ టు ఎర్త్ ఉంటుందని స్టార్ డం ఎంత వచ్చినా ఒదిగి ఉంటుందని అనుకునేవారు ఉన్నారు. ఏదేమైనా ఫ్రీగా అయితే సినిమా పబ్లిసిటీ చేసి ఉండదు.. ఆలా అని  డబ్బులు తీసుకోవడంలో తప్పు కూడా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: