ఐపీఎల్ లో.. ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ చేస్తా : నవీన్ పోలిశెట్టి

praveen
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సైడ్ క్యారెక్టర్లతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నవీన్ పోలీస్ శెట్టి ఇక ఇప్పుడు వరుస సినిమాలతో సూపర్ హిట్ లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న జాతి రత్నాలు అనే సినిమాతో సెన్సేషనల్ విజయాన్ని అందుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకొని సీనియర్ హీరోయిన్ అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.  ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులందరికీ అంచనాలు పెంచేసింది.

 కాగా ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు అని చెప్పాలి. ఇక వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అని చూడటానికి కూడా అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. అయితే నవీన్ పోలిశెట్టి  లాంటి హీరో ప్రమోషన్స్ చేస్తే ఇక అతను చేసే రచ్చ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 ఈ క్రమంలోనే ఇటీవలే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో నవీన్ పోలిశెట్టి బెంగుళూరు, హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం కి వస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఈరోజు సాయంత్రం నేను సన్రైజర్స్, బెంగళూరు మ్యాచ్ కోసం స్టేడియం కి వచ్చాను. ఎవరైనా గాయపడితే ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ చేసేందుకు రెడీగా ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా.. ఇక ఇది అభిమానుల దృష్టిని తెగ ఆకర్షిస్తుంది అని చెప్పాలి. నువ్వు తోపు బ్రో ఐపీఎల్ మ్యాచ్లను కూడా అటు నీ సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నావు అంటూ కొంతమంది అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: