బాలయ్య సినిమా కోసం.. బిగ్ ప్లాన్ వేసిన డైరెక్టర్ అనిల్?

praveen
వరుస బ్లాక్ బస్టర్ లతో జోరు మీద ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్నాడు అనే విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి సినిమా అంటేనే ఏదో కొత్తదనం ఉట్టిపడుతుంది. దీంతో ఇక బాలయ్యను అనిల్ ఎంత కొత్తగా చూపించబోతున్నాడో అని అభిమానులు అందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకుంటున్నారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా బాలయ్య కూతురి పాత్రలో శ్రీ లీల నటిస్తుంది.


 ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ అయితే నందమూరి అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేసింది అని చెప్పాలి. అంతేకాదు 90లలో బాలయ్యను మరోసారి గుర్తు చేసింది అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే బాలయ్య సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి మరో బిగ్ ప్లాన్ వేశాడు అన్నది తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా ఒక స్టార్ హీరోయిన్ తో సంప్రదింపులు కూడా జరుపుతున్నాడు అన్న టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

 ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్ లో బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే. ఇలా స్పెషల్ సాంగ్ కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి రంగంలోకి దిగి పూజ హెగ్డే తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇక ఈ సాంగ్ సినిమాకు మొత్తానికి హైలైట్ గా మారుతుందని భావిస్తూ ఉన్నారట. గతంలో రంగస్థలంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తే ఈపాటు సూపర్ హిట్ అయింది. దీంతో ఇక పూజా హెగ్డే ని స్పెషల్ సాంగ్లో పెట్టుకుంటే సినిమాకు ప్లస్ అవుతుందని దర్శకుడు నమ్ముతున్నాడట. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ చకచకా కంప్లీట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఒకవైపు బాలయ్య క్రేజ్ కి తగ్గట్లుగా పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు తనదైన మార్క్ కామెడీ జోడిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: