రష్మికకు షాకిచ్చిన రౌడీ హీరో ఫ్యాన్స్.. వదిన అంటూ రచ్చ?

praveen
సాధారణంగా సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందంటే చాలు..  ప్రేక్షకులందరికీ కూడా ఆ జోడి ఫేవరెట్ జోడీగా మారిపోతూ ఉంటుంది. అయితే సినిమాల్లో కనిపించిన ఈ జోడి బయట ఎక్కడైనా కలిసి కనిపించింది అంటే చాలు ఇక వారికి రిలేషన్షిప్ అంటగట్టడం చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. టాలీవుడ్ లో రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న విషయంలో కూడా ఇదే జరిగింది.

 వీరిద్దరూ గీతాగోవిందం అనే సినిమాలో నటించగా.. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. వీరి కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమాలో కూడా వీరి కాంబినేషన్ రిపీట్ అవ్వగా.. రొమాన్స్ తో రెచ్చిపోయింది ఈ జంట. దీంతో అప్పటి నుంచి వీరి మధ్య ఏదో నడుస్తుంది అని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇక అప్పుడప్పుడు మాల్దీవ్స్ కి వీరిద్దరూ కలిసి వెళ్తున్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం.. ఇక అప్పుడప్పుడు ఎయిర్పోర్టులో ఒకేసారి ఇద్దరు కనిపించడంతో వీరి మధ్య నిజంగానే రిలేషన్షిప్ ఉంది అంటూ గట్టిగానే ప్రచారం జరుగుతుంది.

 ఇంత జరిగిన తమ మధ్య మాత్రం ఏమీ లేదు అన్నట్లు ఉంటున్నారు కానీ ఈ విషయాన్ని గట్టిగా ఖండించలేదు. కాగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా ఫంక్షన్ లో కూడా వీరి లవ్ మేటర్ కి సంబంధించి చర్చ మీదికి వచ్చింది. ఆనంద్ దేవరకొండ బేబీ అనే సినిమాలో నటించాడు. సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగకగా నేషనల్ క్రష్ రష్మిక చేతుల మీదుగా ప్రేమిస్తున్న అనే లిరికల్ సాంగ్ ని  రిలీస్ చేశారు. అయితే ఈ సినిమా ఫంక్షన్ సమయంలో విజయ్ ఫ్యాన్స్ రష్మికకు షాక్ ఇచ్చారు. విజయ్ తమ్ముడు ఆనంద్, రష్మిక మాట్లాడుతున్న సమయంలో వదిన అంటూ అరుపులతో హడావిడి చేశారు. రష్మిక మరిది కోసం సహాయం చేయడానికి వచ్చిందంటూ అర్థం వచ్చేలా వదిన అంటూ అరిచారు. రష్మిక కూడా ఈ అరుపులు విని నవ్వుకుంది. దీన్నిబట్టి ఇక విజయ్,రష్మిక లవర్స్ అభిమానులు ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యారనీ అర్థమవుతుందని కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: