సలార్: ఫ్యాన్స్ జస్ట్ రిలాక్స్.. అవి పూకార్లే?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా సలార్. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ స్టొరీతో ఈ సినిమాని ప్రశాంత్ నీల్ సిల్వర్ స్క్రీన్ పై తీసుకురాబోతున్నాడు.ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కేజీఎఫ్ సిరీస్ కి మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని టాక్. హోంబలే ఫిలిమ్స్ ఈ మూవీపై ఏకంగా 300 కోట్ల దాకా పెట్టుబడి పెడుతోంది.ఇదిలా ఉంటే ఆదిపురుష్ సినిమా రిలీజ్ తర్వాత సలార్ సినిమాకి సంబందించిన టీజర్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో సమాచారం వినిపిస్తోంది. మూవీలో అన్ని పాత్రలు బ్లాక్ కాస్ట్యూమ్స్ ని ధరించడం వెనుక కూడా కాన్సెప్ట్ ఉందని సమాచారం తెలుస్తోంది. బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథని ప్రశాంత్ నీల్ చెప్పబోతున్నారంట. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 28 వ తేదీన ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.


అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాపై కొత్త రూమర్స్ తెర పైకి వచ్చాయి. సలార్ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదని అలాగే పోస్ట్ ప్రొడక్షన్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి మరికొంత టైమ్ పడుతుందని ప్రచారం అవుతుంది. సినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా వేయడానికి మూవీ టీం రెడీ అవుతోంది అంటూ జోరు గా అనేక గాసిప్స్ వినిపిస్తున్నాయి.అయితే ఈ ప్రచారానికి నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నుంచి ఒక క్లారిటీ వచ్చింది. సలార్ మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదని మూవీ టీం చెప్పింది.ముందు ప్రకటించిన సెప్టెంబర్ 28 వ తేదీన సలార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు.బయట జరుగుతున్న ప్రచారాలు ఏవి నమ్మొద్దు అంటూ కూడా చెప్పేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: