ఏంటి.. నాగచైతన్యకు అఖిల్ కాకుండా.. మరో తమ్ముడు ఉన్నాడా?

praveen
సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో విషయాలు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తూ అందరిని అవ్వక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు అక్కినేని హీరో నాగచైతన్య గురించి కూడా ఇలాంటి వార్త ఒకటి వైరల్ గా మారిపోయింది. అక్కినేని అన్నదమ్ములు ఎవరు అంటే నాగచైతన్య, అఖిల్ అని చెబుతూ ఉంటారు ఎవరైనా. వీరిద్దరు కూడా ప్రస్తుతం నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తూ ఉన్నారు.

అయితే అక్కినేని నాగచైతన్యకు అటు అఖిల్ కాకుండా మరో తమ్ముడు ఉన్నాడట. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. నాగచైతన్య తల్లి లక్ష్మితో ఒకప్పుడు నాగార్జునకు పెళ్లి జరిగింది. లక్ష్మీ రామానాయుడు కూతురు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్ల తర్వాత వీరిద్దరికీ పడకపోవడంతో విడాకులు తీసుకున్నారు. అయితే వీరిద్దరూ విడిపోయిన రెండు కుటుంబాల మధ్య రిలేషన్ మాత్రం ఇప్పటికీ బాగుంది. అయితే ఇక నాగార్జున లక్ష్మీ విడిపోయే సమయానికి అటు నాగ చైతన్య పుట్టాడు. అయితే నాగార్జునతో విడాకుల తర్వాత మాత్రం లక్ష్మి మరో పెళ్లి చేసుకుంది.

 నాగార్జున కూడా అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే లక్ష్మి చెన్నయ్ బిజినెస్మెన్ శరత్ విజయరాఘవన్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఇక రెండో పెళ్లి చేసుకున్న తర్వాత లక్ష్మి మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే వాళ్లు ఈ విషయాన్ని ఎంతో సీక్రెట్ గానే ఉంచారు. కానీ కొన్నేళ్ల కిందటే లక్ష్మీ శరత్ కొడుకు పెళ్లి కూడా ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లికి చైతు, సామ్ కూడా హాజరయ్యారు. ఈ ఫోటోలు అప్పట్లో వైరల్ గా మారిపోయాయి. ఇలా నాగచైతన్యకు తండ్రి ద్వారా అఖిల్ తల్లి ద్వారా మరో తమ్ముడు ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: