మదర్స్ డే రోజున షాక్ కి గురి చేసిన చెప్పవే చిరుగాలి హీరోయిన్...!!

murali krishna
తెలుగులో పలు సినిమాలు చేసిన హీరోయిన్ అభిరామి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్లుగా పిల్లలు కలగట్లేదని అలా చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకీ ఏంటి సంగతి?
తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. వేణుతో చేసిన ‘చెప్పవే చిరుగాలి’ ఈమెకు కాస్తో కూస్తో గుర్తింపు తెచ్చిన మూవీ. ఇందులో కామెడీ, ఎమోషన్స్, లవ్ లాంటివి ఇప్పటికీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. వేణు పక్కన హీరోయిన్ గా భలే సెట్ అయింది. కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ చేసింది. ఆమె పేరే అభిరామి. నిజ జీవితంలో ఈమెకు పెళ్లయి 14 ఏళ్లు అయింది. ఇప్పటికీ పిల్లలు కలగలేదు. దీంతో ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అదికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
అసలు విషయానికొచ్చేస్తే.. హీరోయిన్ అభిరామి అంటే తెలియకపోవచ్చు. కానీ ‘చెప్పవే చిరుగాలి’ బ్యూటీ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. తెలుగులో ‘థాంక్యూ సుబ్బారావ్’, ‘చార్మినార్’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ లాంటి మూవీస్ చేసింది. కానీ పెద్దగా గుర్తింపు అయితే తెచ్చుకోలేకపోయింది. దీంతో తన సొంత భాష మలయాళంలో నటిస్తూ బిబీబిజీగా ఉంది. ప్రస్తుతం సురేష్ గోపీతో కలిసి ‘గరుడన్’ చేస్తోంది. అయితే తాజాగా మదర్స్ డే సందర్భంగా తన గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.
14 ఏళ్ల క్రితం ప్రముఖ రచయిత పవనన్ మనవడు రాహుల్ పవనన్ ని అభిరామి పెళ్లి చేసుకుంది. కానీ వీళ్లకు ఇప్పటివరకు పిల్లలు పుట్టలేదు. దీంతో గతేడాది ఓ పాపని దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టిన ఈ హీరోయిన్.. తాజాగా మదర్స్ డే సందర్భంగా పాపతో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసి మరీ ఈ హ్యాపీన్యూస్ ని అందరితో షేర్ చేసుకుంది. దీంతో ఇవికాస్త వైరల్ గా మారిపోయాయి. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె విషెస్ చెబుతున్నారు. మరి 14 ఏళ్ల నుంచి తల్లి కావట్లేదని బాధపడుతూ, ఫైనల్లీ పాపని దత్తత తీసుకోవడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: