"బిచ్చగాడు 2" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక... తేదీ... సమయం ఖరారు..!

Pulgam Srinivas
ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు బ్లాక్ బాస్టర్ విజయం సాధించినటు వంటి బిచ్చగాడు మూవీ తో అద్భుతమైన గుర్తింపును ... సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమా ద్వారా ఈ హీరోకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ లభించింది.
 

ఈ మూవీ తర్వాత విజయ్ అనేక మూవీ లను తెలుగు లో విడుదల చేశాడు. కాకపోతే ఏ మూవీ కూడా బిచ్చగాడు రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు. ఇది ఇలా ఉంటే బిచ్చగాడు మూవీ తో అద్భుతమైన విజయాన్ని ... అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న విజయ్ తాజాగా బిచ్చగాడు 2 మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విజయ్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో కావ్య తప్పర్ ... విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను మే 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం తెలుగు లో కూడా భారీ ఎత్తున ప్రమోషన్ లను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ బృందం హైదరాబాద్ లో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల అయ్యింది. ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మే 16 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని "జే ఆర్ సి" కన్వెన్షన్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ తో విజయ్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: