ఆ విషయంలో నాగ చైతన్యను క్లాస్ పీకిన నాగార్జున...!!

murali krishna
ఇండస్ట్రీ లో ఒకప్పుడు మల్టిస్టార్రర్ సినిమాలు ఎన్నో వచ్చాయి.చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా కథకి అనుసరిస్తూ ఎలాంటి ఇగోలు లేకుండా అప్పట్లో 
ఉదాహరణకి కృష్ణ అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కి సరిసమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో, మాస్ లో ఈయనకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు.అలాంటి హీరో, అప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చిన చిరంజీవి లాంటి కొత్త హీరోతో తోడు దొంగలు వంటి సినిమా చేసాడు.
ఈ సినిమాలో ఇద్దరి పాత్రలు సరిసమానంగా ఉంటాయి.కృష్ణ నాకంటే చిన్న హీరో అనుకొని , చిరంజీవి తో కలిసి ఆ సినిమా చెయ్యకపొయ్యుంటే అంత పెద్ద సూపర్ హిట్ సినిమాని ఇండస్ట్రీ మిస్ అయ్యేది.
అప్పట్లో అలా ఉండేది ఇండస్ట్రీ లో వాతావరణం.నేటి తరం హీరోలలో అలాంటి వాతావరణం లేదు అనడం లేదు కానీ, కొంతమంది హీరోలలో మాత్రం వీడితో కలిసి సమానంగా నేను చెయ్యడం ఏంటి అనే భేదభావం ఉంది.
అందుకు ఉదాహరణగా మీకు ఒక సంఘటన చెప్పాలి.అక్కినేని నాగార్జున మరియు సునీల్ హీరోలు గా అప్పట్లో తడాకా అనే చిత్రం విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.ఇది తమిళం సూపర్ హిట్ గా నిల్చిన వెట్టై అనే చిత్రానికి రీమేక్.
అక్కడ ఆర్య మరియు మాధవన్ హీరోలుగా నటించారు.రీమేక్ రైట్స్ కొనగానే నాగ చైతన్య ఇందులో ఒక హీరో అనే విషయం ఖరారు అయ్యింది.
కానీ మరో హీరోగా ఎవరిని తీసుకోవాలి అని ఆలోచిస్తుండగా పలువురి హీరోల పేర్లు తెరమీదకి వచ్చాయి కానీ, ఇలాంటి పాత్రకి కేవలం సునీల్ మాత్రమే సరిపోతాడు అని అతని పేరుని ప్రపోజ్ చేసాడట డైరెక్టర్ డాలీ.సునీల్ పక్కన నేను చెయ్యడం ఏంటి, అతను నాతో సరిసమానమైన హీరోనా ఇందులో, అతనిని పెడితే నేను ఈ సినిమా చెయ్యను అని నాగ చైతన్య డైరెక్టర్ తో అన్నాడట.
నాగ చైతన్య ఇలా అన్నాడు అనే విషయం సునీల్ కి కూడా తెలిసి ఫీల్ అయ్యాడట.వీళ్లిద్దరి మధ్య అప్పట్లో గొడవలు కూడా ఏర్పడ్డాయని టాక్ కూడా నడిచింది.ఈ విషయాన్ని తెలుసుకున్న నాగార్జున నాగ చైతన్య ని ఇంటికి పిలిచి సునీల్ ని తక్కువ చేసినందుకు బాగా క్లాస్ పీకాడట.అతనితో చేస్తే నీ విలువ ఎందుకు తగ్గుతుంది, సునీల్ కి హీరో గా అప్పట్లో 30 కోట్ల రూపాయిల షేర్ సినిమా ఉంది, నీకు ఉందా అలాంటి సినిమా?,ఎందుకు ఇలా ఒకరిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు అంటూ గట్టిగా క్లాస్ పీకాడట.ఆ తర్వాత సునీల్ ని కూడా ఇంటికి పిలిచి నాగ చైతన్య తో క్షమాపణలు చెప్పించాడట నాగార్జున.
అలా ఈ చిత్రం తెరకెక్కింది, కమర్షియల్ గా అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సూపర్ హిట్.ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చిందట, నాగ చైతన్య కి కూడా మంచి మాస్ ఇమేజి ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: