రాజకీయాల్లోకి వస్తా... ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన బండ్ల గణేష్..!

Pulgam Srinivas
నటుడు మరియు నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిన్న చిన్న పాత్రలలో నటించి నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత రవితేజ హీరోగా రూపొందినటువంటి ఆంజనేయులు మూవీ తో నిర్మాతగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలను నిర్మించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

బండ్ల గణేష్ నిర్మించిన సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో బండ్ల ఒక చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే పోయిన సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గాని ... ఎంపీగా కానీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తాను అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.

అలాగే కొన్ని పార్టీలపై తనదైన రీతిలో విమర్శలను కూడా చేశాడు. ఆ తర్వాత రాజకీయాలు మనకు సరిపోవు అని రాజకీయాల నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు. తాజాగా బండ్ల మరోసారి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశాడు. తాజాగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ... రాజకీయాలంటే నిజాయితీ ... రాజకీయాలంటే నీతి ... రాజకీయాలంటే ఇష్టం ... రాజకీయాలంటే పౌరుషం ... రాజకీయాలంటే శ్రమ ... రాజకీయాలంటే పోరాటం ... ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి ... చేరాలి ... రావాలి ... అందుకే వస్తున్నా. అంటూ ఒక పోస్ట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: