టాలీవుడ్ టాప్ హీరోస్ తమిళ దర్శకులతో చేసిన సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న ఎంతో మంది హీరోలు ఇప్పటికే ఎంతో మంది తమిళ దర్శకుల దర్శకత్వంలో రూపొందిన సినిమా లలో హీరో గా నటించారు. అందులో భాగంగా కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు తమిళ దర్శకుల దర్శకత్వంలో నటించిన కొన్ని సినిమాల వివరాలను తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో రూపొందిన ఖుషి , బంగారం , కొమరం పులి , పంజా మూవీ లకు తమిళ దర్శకులు పని చేశారు. ఈ మూవీ లలో ఖుషి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ ని సాధించగా మిగతా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావాన్ని చూపలేదు.

నాచురల్ స్టార్ నాని తన కెరియర్ లో ఇప్పటి వరకు సెగ , ఎటో వెళ్లిపోయింది మనసు , జెండాపై కపిరాజు అనే మూడు సినిమా లతో తమిళ దర్శకులతో పని చేశారు. ఇది ఇలా ఉంటే ఈ మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయాయి. 

అక్కినేని నాగ చైతన్య ఇప్పటి వరకు తన కెరీర్ లో ఏం మాయ చేసావే , సాహసం శ్వాసగా సాగిపో , కస్టడీ అనే మూడు మూవీలతో తమిళ దర్శకులతో పనిచేశాడు. 

మాస్ మహారాజ రవితేజ తన కెరీర్ లో శంభో శివ శంభో , దరువు మూవీ లతో తమిళ దర్శకులతో పని చేశాడు. ఈ మూవీ లలో శంభో శివ శంభో మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

రామ్ పోతినేని తన కెరియర్ లో గణేష్ , ది వారియర్ మూవీ లతో తమిళ దర్శకులతో పని చేశాడు. ఈ రెండు మూవీ లు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయాయి.

మెగాస్టార్ చిరంజీవి "స్టాలిన్" మూవీ తో తమిళ దర్శకుడు తో పని చేశాడు.

విజయ్ దేవరకొండ "నోట" మూవీ తో తమిళ దర్శకుడితో పని చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: