"నేను స్టూడెంట్ సార్" మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్త బృందం..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ కథానాయకుడు స్వాతిముత్యం మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ  ఇచ్చిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను కూడా అద్భుతమైన రీతిలో రీతిలో అలరించింది.
 

ఈ మూవీ లో తన డీసెంట్ నటనతో గణేష్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా ఇప్పటికే స్వాతిముత్యం మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ యువ నటుడు ప్రస్తుతం నేను స్టూడెంట్ సర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. నంది సతీష్ వర్మ ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా ... రాఖీ ఉప్పులపాటి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో సముద్ర కని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక కేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క విడుదల తేదీన ప్రకటించింది. ఈ మూవీ ని జూన్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇప్పటికే స్వాతిముత్యం మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న గణేష్ "నేను స్టూడెంట్ సర్" మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: