పూనమ్ కౌర్ దెబ్బకు ఉస్తాద్ భగత్ సింగ్ ను మార్చేశారుగా..!!

Divya
పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. నిన్నటి రోజున ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. దీంతో ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద మాత్రమే ఉస్తాద్ భగత్ సింగ్.. అనే నియమను టైటిల్ తో ఉంచడంతో ప్రతి ఒక్కరు విమర్శించడం జరిగింది.
అలా అలనాటి హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఈ విషయంపై చాలా ఘాటుగానే స్పందించింది.. మనం స్వాతంత్ర సమరయోధులను గౌరవించకపోయిన పరవాలేదు కానీ ఇలా అవమానించకండి అంటూ ఈ పోస్టర్ను చూపిస్తూ క్యాప్షన్ రాసుకుంది.. అంతేకాకుండా భగత్ సింగ్ పేరుని కాల దగ్గర పెట్టడమేంటి ఇది అహంకారమా? లేకపోతే అజ్ఞానమ అంటూ తన ట్విట్టర్ నుంచి షేర్ చేసింది. ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఈ విషయం పైన స్పందించడం జరిగింది.

పూనమ్ కౌర్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ పాదాల కింద భగత్ సింగ్ పేరును ఉంచినందుకు డైరెక్టర్ హరిశంకర్ మరియు డిజైనర్లను సైతం ఖండించడం జరిగింది. ఆ తర్వాత కొత్త పోస్టర్లలో టీం ఈ విషయం పైన కాస్త శ్రద్ధ పెట్టి మరి..ఉస్తాద్ భగత్ సింగ్ పేరున పైన ఉంచడం జరిగింది. పూనమ్ కౌర్  ఇలా స్పందించడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. పూనమ్  కౌర్ పైన పవన అభిమానులు కూడా కాస్త ఆగ్రహానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. మరి కొంతమంది మాత్రం పూనమ్ కు సపోర్టుగా నిలుస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత మరి ఎలాంటి ఇబ్బందులను ఇంకా ఎదుర్కొంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: