నేను మిస్ వరల్డ్ గెలిచినప్పుడు.. నా భర్త వయస్సు 7 ఏళ్ళు : ప్రియాంక చోప్రా

praveen
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా వివాహం అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే తనకంటే ఏకంగా పదేళ్లు చిన్నవాడైనా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియాంక చోప్రా. పాపం నిక్ జోనస్ చివరికి తనకంటే పదేళ్లు పెద్దదైన ఆంటీ ని పెళ్లి చేసుకున్నాడు అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు వీరిద్దరి జంట ఎక్కడ ప్రత్యక్షమైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంది. ఇకపోతే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తాను పెళ్లికి ముందు చాలా మందితో డేటింగ్ చేశానని.. తన భర్త కూడా ఎంతో మందితో డేటింగ్  చేసి చివరికి నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటూ షాకింగ్ విషయాలను వెల్లడించింది ప్రియాంక చోప్రా.

 ఇకపోతే ఇటీవలే మరో ఆసక్తికర విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. తాను విశ్వసుందరిగా కిరీటం గెలుపొందిన సమయంలో తన భర్త నిక్ జోనస్ వయస్సు కేవలం ఏడేళ్లు మాత్రమే అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. నిక్ జోనస్ తో పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళ అమ్మ నాతో ఒక మాట చెప్పారు. అది ఇప్పటికి మరిచిపోలేను. 17 ఏళ్ల వయసులోనే లండన్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ పోటీలలో నేను పాల్గొన్నాను. అప్పుడు ఇంకా నేను చిన్న పిల్లనే.. ఏం చేస్తున్నానో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు.

 అయితే నేను టైటిల్ గెలుపొందిన క్షణాలు తనకి ఇంకా గుర్తేనని.. నిక్ వాళ్ళ అమ్మ నాతో చెప్పారు. అయితే నేను మిస్ వరల్డ్ టైటిల్ గెలిచినప్పుడు నిక్ వయస్సు కేవలం ఏడేళ్లు మాత్రమే అన్న విషయాన్ని ఆమె చెప్పడంతో నేను షాక్ అయ్యా. ఇంట్లో వాళ్లతో పాటు నిక్ కూడా టీవీ ముందు కూర్చుని నన్ను చూశాడట. తలుచుకుంటేనే ఇది వింతగా ఉంది. చివరికి విధి మా ఇద్దరిని కలిపింది. మేము కలవాలని రాసిపెట్టి ఉందనుకుంట.. వయస్సు పరంగా వ్యత్యాసం ఉన్నా మేమిద్దరం ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: