విజయ్ దేవరకొండ నటించిన ఆ మూవీకి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలుసా..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన విజయ్... తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు మూవీ తో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత గీత గోవిందం ... టాక్సీవాలా లాంటి వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయిన విజయ్ ప్రస్తుతం సమంత హీరోయిన్ గా శివ నర్వనా దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఈ మూవీ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తున్ననురి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో విజయ్ హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గ నటించబోతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడింది. ఇది ఇలా ఉంటే విజయ్ నటించిన మూవీ లలో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ లను కూడా అందుకున్నాయి. అలా విజయ్ కెరీర్ లో భారీ అపజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న సినిమాలలో "వరల్డ్ ఫేమస్ లవర్" సినిమా ఒకటి.

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాశి కన్నా , ఐశ్వర్య రాజేష్ , కేథరిన్ హీరోయిన్ లుగా నటించగా ... గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. 
మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. దానితో చివరకు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఈ మూవీ ద్వారా నిర్మాతలకు దాదాపు 21 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు వార్తలు అప్పట్లో వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: