అలాంటి వారికీ కనీసం దాని మీద అవగాహన ఉండాలి : రష్మీ

murali krishna
రష్మి గౌతమ్ ప్రత్యేకం గా పరిచయం అవసరం లేని పేరు.బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ ప్రస్తుతం బుల్లితెరపై పెద్ద ఎత్తున సందడి చేస్తూ చాలా బిజీ గా గడుపుతున్నారు.
బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసే రష్మీ సోషల్ మీడియా లో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలో ని సోషల్ మీడియా వేదిక గా ఈమె ఎన్నో రకాల పోస్టులను ఆమె పోస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యం గా ఈమె పెట్ లవర్ అనే సంగతి మనకు తెలిసిందే. మూగజీవాల కు ఎవరైనా హాని చేస్తే ఆమె వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు.
తాజా గా రష్మీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.రజస్వల అయిన 12 ఏళ్ల బాలికను తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి హత్య చేశారట. అయితే తన చెల్లెలు అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఉద్దేశంతో నే తన అన్నయ్య ఆ బాలికను హత్య చేశారనే విషయం పై రష్మీ గౌతమ్ స్పందించారు. ఇలాంటి హత్యలు కేవలం సెక్స్ ఎడ్యుకేషన్  లేకపోవడం కారణంగా నే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఈమె చెప్పుకొచ్చారట. సె*పట్ల సరైన ప్రాథమిక అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని ఈ సందర్భం గా రష్మి గౌతమ్ కామెంట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మినిమం సె* ఎడ్యుకేషన్ ఎంతో అవసరం అంటూ ఈ సందర్భం గా రష్మీ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ఎక్స్ట్రా జబర్దస్త్  కార్యక్రమం తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే స్పెషల్ ఈవెంట్స్ లో కూడా రష్మీ పాల్గొని బాగా సందడి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: