మహేష్ కొత్త సినిమా టైటిల్ విడుదల ఆ తేదీనే..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న మహేష్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. మహేష్ ఆఖరుగా "సర్కారు వారి పాట" అనే సినిమాలో హీరో గా నటించాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో మహేష్ కి జోడి గా నటించగా ... పరుశురామ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది.

ఇలా సర్కారు వారి పాట మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతోంది. ఈ మూవీ లో శ్రీ లీల ... పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం ఇప్పటి వరకు ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

దానితో ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ ను ఎస్ ఎస్ ఎం బి 28 పేరుతో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క టైటిల్ ను మే 31 వ తేదీన విడుదల చేయడానికి చిత్త బృందం సన్నాహాలు చేస్తున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: