ఉస్తాద్ భగత్ సింగ్ కు గబ్బర్ సింగ్ సమస్యలు !

Seetha Sailaja
సంవత్సరాలు తరబడి వరస ఫెయిల్యూర్స్ తో సతమతమైన పవన్ కళ్యాణ్ కు ‘గబ్బర్ సింగ్’ మూవీ నూతన ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా అతడి పారితోషికం చుక్కలు అంటేలా చేసింది. ఈమూవీ తరువాత పవన్ ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ పవన్ అభిమానులకు ఈసినిమా ఇచ్చిన కిక్ మరే సినిమా ఇవ్వలేకపోయింది అన్నది వాస్తవం.

ఈమూవీ తరువాత వచ్చిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఏమాత్రం పవన్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఆమూవీ ఫ్లాప్ గా మారిన విషయం తెలిసిందే. దీనితో ‘గబ్బర్ సింగ్’ స్థాయిలో మరో బ్లాక్ బష్టర్ ను దర్శకుడు హరీష్ శంకర్ తమ హీరోతో చేయాలని అభిమానులు ఎప్పటినుంచో కలలు కంటున్నారు. ఎట్టకేలకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వీరిద్దరి కాంబినేషన్ లో ప్రారంభం కావడంతో ఈమూవీ పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

వాస్తవానికి ‘గబ్బర్ సింగ్’ మూవీకి సీక్వెల్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కథ ఉంటుంది అని డైరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి హరీష్ శంకర్ కు ఏర్పడింది అని అంటున్నారు. దీనికి కారణం ‘గబ్బర్ సింగ్’ లో నటించిన చాలామంది నటీనటులు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో నటించడంలేదు. అయితే ‘గబ్బర్ సింగ్’ లో పవన్ పాత్ర ఎలా తిక్కతో కూడుకున్న పోలీస్ ఆఫీసర్ గా ఉంటుందో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడ పవన్ పోలీస్ పాత్రకు అలాంటి ఛాయలు ఉంటాయి అని తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ రాజకీయాలలో కొనసాగుతూ ఉండటంతో పవన్ పాత్రతో కొన్ని పొలిటికల్ టచ్ ఉన్న డైలాగ్స్ ను హరీష్ శంకర్ ప్రత్యేకంగా ఈమూవీ కోసం చెప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీని వచ్చే ఏడాది మార్చిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు విడుదల చేస్తున్న నేపధ్యంలో అనేక పొలిటికల్ సెటైర్లు ఈమూవీలో పుష్కలంగా ఉంటాయి అని అంటున్నారు. దీనితో వచ్చే ఏడాది ఎన్నికల ముందు విడుదల కాబోతున్న ఈమూవీ సంచలనాలు సృష్టించడం ఖాయం అంటూ ఇప్పటి నుంచే అంచనాలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: