సింగర్ సునీత.. ఆ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోవాలనుకుందా?

praveen
సింగర్ సునీత గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఇక ఎంతోమంది హీరోయిన్లకు తన గాత్రాన్ని అందించి డబ్బింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సునిత.. ఇక అంతకంటే అద్భుతమైన పాటలు పాడి ప్రేక్షకులను సంగీత సాగరంలో మునిగి తేలేలా చేసింది అనడంలో సందేహం లేదు. ఇప్పటివరకు సునీత ఇండస్ట్రీలో వందల పాటలు పాడి కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది.

 అయితే సునీత ఎప్పుడూ తాను పాడిన పాటల ద్వారా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయిన దానికంటే ఇక తన పర్సనల్ లైఫ్ లో వివాదాల ద్వారా హాట్ టాపిక్ గా మారిపోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. 19 ఏళ్ల వయసులోనే ఇంట్లో వాళ్లకు చెప్పకుండా కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీకి దూరంగా వచ్చేసింది సునీత. కానీ కొన్నాళ్లకి ఇక ఫ్యామిలీతో కలిసింది. అయితే ఫ్యామిలీ సపోర్ట్ తో సినిమాల్లో పాటలు పాడటం మొదలు పెట్టింది. ఇలా సినిమాల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించి స్టార్ సింగర్ గా హవా నడిపించింది.

 ఆ తర్వాత సునీతకి కిరణ్ కి మధ్య గొడవలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. అయితే అప్పటికే సునీతకు మ్యూజిక్ డైరెక్టర్ లతో ఎఫైర్ ఉందంటూ వార్తలు భగ్గుమన్నాయి. దీంతో సునీత, కిరణ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయ్. ఇలాంటి సమయంలోనే సునీత తన భర్త కిరణ్ ఫ్రెండ్ అయినా డైరెక్టర్ విఎన్ ఆదిత్యతో కాస్త సన్నిహితంగా మెదిలిందట. ఇది చూసిన కిరణ్ మరింత అనుమానించడం మొదలుపెట్టాడట. సునీత విఎన్ ఆదిత్య రిలేషన్షిప్ అటు ఇండస్ట్రీ మొత్తం వైరల్ గా మారిందట. అయితే అప్పట్లో భర్త కిరణ్ కి విడాకులు ఇచ్చి సునీత విఎన్ ఆదిత్యను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ భర్తకు విడాకులు ఇచ్చిన సునీత ఎన్నో రోజులపాటు ఒంటరిగా ఉండి తన స్నేహితుడు రామ్ ను పెళ్లి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: