అఫీషియల్ : "కస్టడీ" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చైతు సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ మూవీ లో ప్రియమణి , అరవింద స్వామి కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ లో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
 

ఈ మూవీ ని మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ నుండి నిన్న అనగా మే 5 వ తేదీన ఈ చిత్ర బృందం చెన్నై లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు అన్నపూర్ణ 7 ఎకర్స్ లో సాయంత్రం 6 గంటలకు ప్రారంభించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రస్తుతం టాలీవుడ్ ... కోలీవుడ్ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మార్చి 12 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: