పుష్ప ది రూల్ : నెక్స్ట్ షెడ్యూల్ అప్పటినుండి..!

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. దానితో కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఒక వీడియోను కూడా విడుదల చేసింది.

ఆ వీడియోకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ మూవీ పై ఉన్న అంచనాలను కూడా అమాంతం పెంచేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ఈ నెల చివరన ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఈ చిత్ర బృందం ఈ సినిమా లోని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

మైత్రి మూవీ సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ లో మలయాళ నటుడు ఫాహాధ్ ఫజిల్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మొదటి భాగం లోని పాటలు ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించడంతో ఈ సినిమా యొక్క రెండవ భాగం పాటలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: