అఫీషియల్ : ఖుషి మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న వారిలో శివ నర్వన ఒకరు. ఈ దర్శకుడు నాచురల్ స్టార్ నాని హీరో గా రూపొందినటు వంటి నిన్ను కోరి మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
 

ఆ తర్వాత మజిలీ మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆఖరుగా ఈ దర్శకుడు టక్ జగదీష్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా రూపొందుతున్న ఖుషి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబరు 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క ప్రమోషన్ లను మొదలు పెట్టబోతుంది. అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన మొదటి పాటను విడుదల చేయబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా ఈ మూవీ బృందం విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి మొదటి పాట విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను "సరిగమ" సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: