అఫీషియల్ : "సింహాద్రి" మూవీ బుకింగ్స్ ఆ తేదీ నుండి ఓపెన్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఆది"  లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తో అద్భుతమైన  క్రేజ్ ను సంపాదించుకున్న తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సింహాద్రి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఆది మూవీ తర్వాత ఎన్టీఆర్ నటించిన పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న సమయం లోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగి పోయాయి.

 అలా భారీ అంచనాల నడుమ 2093 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన భూమిక , అంకిత హీరోయిన్ లుగా నటించగా ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ముఖేష్ ఋషి , నాజర్ , బ్రహ్మానందం , కోట శ్రీనివాసరావు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

ఇలా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ సినిమాను ఈ సంవత్సరం మే 20 వ తేదీన థియేటర్ లలో మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఇప్పటికే ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితం విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యొక్క టికెట్ బుకింగ్స్ ను మే 10 వ తేదీ నుండి ఓపెన్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రీ రిలీజ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: