"ఆర్సి16" కోసం అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటు వంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన సాలిడ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా గ్లోబల్ గా తన క్రేజీ ను పెంచుకున్నాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ...  కియార అద్వానీ ఈ మూవీ లో చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అంజలి , శ్రీకాంత్ , సునీల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత చరణ్ ... బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా రూపొందబోతుంది. ఇప్పటికే ఈ మూవీ దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ముద్దుగుమ్మతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జాన్వి ఈ సినిమాలో నటించాలి అంటే 6 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: