అఫీషియల్ : ఉస్తాద్ భగత్ సింగ్ నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తమిళ స్టార్ హీరో లలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ హీరో గా అట్లీ దర్శకత్వంలో రూపొందిన తేరి అనే తమిళ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తేరి మూవీ ని తెలుగు లో పోలీసోడు పేరుతో విడుదల చేశారు.

 మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా కథలో అనేక మార్పులు ... చేర్పులు చేసినట్లు ... అలాగే ఈ మూవీ ని తెలుగు ప్రజలకు నచ్చే విధంగా అనేక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో పవన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఒక షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు ... నెక్స్ట్ షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక ఫోటోను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి గ్లిమ్స్ వీడియోను ఈ నెల 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: