ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు ఇళయరాజా. ఇప్పటికీ ఈయన పాటలు వింటే ఎంతోమందికి హాయిగా నిద్రపుచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది.అయితే తాజాగా ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆయన అన్నయ్య బావలార్ వరదరాజన్ కొడుకు పావలార్ శివన్ నిన్నటి రోజున కన్ను మూసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన వయసు 60 సంవత్సరాలు గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శివ చికిత్స పొందుతూ నిన్నటి రోజున రాత్రి తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
దీంతో పావలార్ శివన్ మృతి పట్ల  సినీ ప్రముఖులతోపాటు రాజకీయ వేతలు కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు. పావలార్ శివన్ తన కుటుంబంతో కలిసి పుందుచేరిలో నివాసం ఉండేవారు.. ఆయన ఫేమస్ గిటారిస్ట్ అలా కొన్ని సంవత్సరాలుగా ఇళయరాజా సంగీత బృందంలో గిటారిస్టుగా కూడా పనిచేయడం జరిగిందట.ఇళయరాజా సంగీత ప్రయాణానికి తన అన్నయ్య పావలార్ వరదరాజన్ చాలా సపోర్ట్ చేశారట. ఆయన గేయ రచయిత మాత్రమే కాకుండా సంగీత విద్వాంసుడు అన్నట్లుగా తెలుస్తోంది.

ఇళయరాజా సోదరుడు వరదరాజన్ 1973 లో మరణించినట్లు తెలుస్తోంది.ఆయనకు ఇద్దరు కుమారులు ఒకరు 2020 లో కిడ్నీ సమస్యలతో మరణించాగ ..ఇప్పుడు మరొక కుమారుడు పావలార్ శివన్ మే రెండవ తేదీన అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. పావలార్ శివన్ రెండు మూడు చిత్రాలకు సంగీత దర్శకుడుగా కూడా పనిచేశారు.పావలార్ శివన్ అంత్యక్రియలు కూడా ఈరోజే నిర్వహించబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఇళయరాజా, యువ శంకర్రాజ, కార్తీక రాజ తదితరులు పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇళయరాజా ఇప్పటికీ పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తూనే ఉన్నారు. ఇళయరాజా అన్న కొడుకు మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: