ఏంటి.. అక్కినేని అఖిల్ కి.. పూజా హెగ్డే అంటే అంత ఇష్టమా?

praveen
అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం ఏజెంట్. స్పై త్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచింది అన్న విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచి కూడా నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది.  మూడో రోజుకే ఈ సినిమా ప్లాప్ అన్న విషయం తేలిపోయింది. అయితే ఇక ఇంత భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ కెరియర్ ముగిసిపోయినట్లే అని కొంతమంది సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఏజెంట్ సినిమా ప్లాప్ అయినప్పటికీ అఖిల్ ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు విశ్లేషకులు.

 అఖిల్ తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినప్పటికీ సినిమా కథ బాగా లేకపోవడం కారణంగానే ఏజెంట్ ఫ్లాప్ అయిందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. అయితే సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అటు అఖిల్ మాత్రం వరుసగా ప్రమోషన్స్ తో బిజీబిజీ గానే ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఏజెంట్ మూవీ యూనిట్ సుమా అడ్డ అనే కార్యక్రమంలోకి వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎప్పటిలాగానే ఈ ప్రోమో మొత్తం నవ్వులతోనే సాగుతూ ఉంటుంది.

 ఈ క్రమంలోనే అక్కినేని వారసుడు అఖిల్ ని సుమ కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడుగుతుంది. అయితే సుమ అడిగిన ప్రశ్నలకు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా టపీమనీ సమాధానం చెప్పేసాడు.  నీకు ఇండస్ట్రీలో ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా.. రామ్ చరణ్ అంటూ చెప్పేశాడు. రామ్ చరణ్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెబుతారు అంటూ అడిగితే.. రామ్ చరణ్ నా హార్ట్ బీట్ అంతకంటే ఇంకేం చెప్పలేను అంటూ అఖిల్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు వరకు మీరు నటించిన హీరోయిన్లలో ఎవరితో అవకాశం వస్తే డేట్ కి వెళ్తారు అంటూ ప్రశ్నించగా ఎదురుగా సాక్షి వైద్యని పెట్టుకుని మరి పూజ హెగ్డే తో డేటింగ్ చేస్తా అంటూ ఆన్సర్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో ఒక్క సినిమాకే పూజా హెగ్డే అఖిల్ ని ఫిదా చేసేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: