ది కేరళ స్టోరీ పై పెరిగిపోతున్న ఆశక్తి !

Seetha Sailaja
పెద్ద సినిమాలకు అయినా అదేవిధంగా చిన్న సినిమాలకు అయినా ఎంత వివాదాలు చుట్టుముట్టితే అంత ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. ఆసినిమా కథలో ఎదో ఉంది అన్న ఆశక్తి జనంలో పెరిగిపోతే జనం విపరీతంగా ధియేటర్లకు వస్తారు. ఆమధ్య వచ్చిన ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా విషయంలో కూడ ఇలాగే జరిగింది.

ఇప్పుడు ‘ది కేరళా స్టోరీ’ విషయంలో కూడ ఇదే జరగబోతోందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈమూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యాక ఈమూవీ పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ముగ్గురు ఇతర మతస్థులైన మహిళలు ముస్లింలను పెళ్లి చేసుకుని వాళ్ళ ద్వారా ప్రభావితం చెంది పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో చేరారనే పాయింట్ మీద ఈసినిమా కథను అల్లారు.

ఈమూవీకి  సెన్సార్ బోర్డు దీనికి చాలా కట్స్ మ్యూట్స్ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. మన శత్రుదేశాన్ని ఉద్దేశించి పెట్టిన డైలాగులు ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తాయని చాల కట్స్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ మూవీ కేరళా లో అధికారంలో ఉన్న మార్కిస్ట్ పార్టీకి తల నొప్పిగా మారే ఆస్కారం ఉండటంతో ఈమూవీని బ్యాన్ చేయమని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. క్రిస్టియన్ వర్గం అధికంగా ఉండే ఆ రాష్ట్రంలో తర్వాత గణనీయమైన జనాభా ముస్లింలదే అందుకే ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బ తింటుందో అన్న భయంతో అక్కడి ప్రభుత్వం ఈవిషయం పై ఆచితూచి అడుగులు వేస్తోంది.

అనధికారిక లెక్కల ప్రకారం కేరళలో దాదాపు 35 వేలకు పైగా అమ్మాయిలు మహిళలు ఇలా మతమార్పిడిలో టెర్రరిజమ్ వైపు ఆకర్షితులయ్యారని ఒక రిపోర్ట్ ఉంది. అయితే ఈ రిపోర్ట్ ఎంతవరకు నిజం అన్నది ఎవరికీ తెలియదు. దీనితో ఈ సినిమా అనుకున్న ప్రకారం అడ్డంకులు తోలిగించుకుని రిలీజ్ అవుతుందా ఒకవేళ రిలీజ్ అయితే ఈ మూవీ కూడ కాశ్మీర్ ఫైల్స్ లా సంచలనాలు సృష్టిస్తుంద అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: