ఎన్టీఆర్ 30 కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ ని ఎన్టీఆర్ 30 అని ఈ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా స్క్రిప్ట్ పనులకు మరియు ప్రీ ప్రొడక్షన్ పనులకు చాలా సమయాన్ని తీసుకున్న ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించిన తర్వాత మాత్రం ఫుల్ స్పీడ్ లో ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తున్నాడు.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం మనకు తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించిన ఈ మూవీ యూనిట్ ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన రెండు షెడ్యూల్లా షూటింగ్ ను పూర్తి చేసింది. కేవలం నెల రోజుల వ్యవధి లోనే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్ ల షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ మూవీ మొదటి షెడ్యూల్లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ మూవీ యూనిట్ చిత్రీకరించగా ... రెండవ షెడ్యూల్ లో ఈ మూవీ లో వచ్చే ఒక మేజర్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించింది.

ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ ను మే రెండవ వారంలో ఈ మూవీ యూనిట్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా ...  బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్టీఆర్ ... జాన్వి కపూర్ ... సైఫ్ అలీ ఖాన్ పై ఈ మూవీ యూనిట్ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: