ఆదిపురుష్ పై ఆగని ట్రోల్స్...!!

murali krishna
భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి సినిమా ఎలా ఉన్నా కూడా విడుదల కు ముందు విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు మంచి రెస్పాన్స్ ను అయితే సొంతం చేసుకుంటాయి.
సినిమాలో బాగున్న కంటెంట్ ను మాత్రమే టీజర్, ట్రైలర్ లో చూపించడం అయితే జరుగుతుంది. అయితే ఆదిపురుష్ సినిమా విషయం లో మాత్రం భిన్నంగా అయితే జరుగుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ల కు నెగిటివ్ రెస్పాన్స్ అయితే వస్తోంది.
సీత పాత్ర లో కృతిసనన్ నటించ గా ఆమె పోస్టర్ కు నెగిటివ్ కామెంట్లు అయితే వస్తున్నాయి. కృతిసనన్ నటించిన సీత పోస్టర్ పౌరాణిక సినిమాల ను ఇష్టపడే వాళ్లకు ఏ మాత్రం కూడా నచ్చేలా లేదు. తెలుగులో గతంలో సీత పాత్రను పోషించిన నటీమణులతో పోల్చి చూస్తే మాత్రం ఈ సీత అస్సలు సాటిరాదని నెటిజన్ల నుంచి కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలుగు సినిమాలలో సీత పాత్ర అంటే భారీ అంచనాలు అయితే ఉంటాయి.
అయితే ఆదిపురుష్ సీత మాత్రం ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం కూడా ఆకట్టుకునేలా లేదు. లవకుశ సినిమాలో అంజలీ దేవి సీత పాత్రలో నటించి అద్భుతమైన అభినయంతో అయితే మెప్పించారు. 1963లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో అయితే నచ్చింది. బాపు డైరెక్షన్ లో తెరకెక్కిన సంపూర్ణ రామాయణం సినిమాలో సీత పాత్రలో చంద్రకళ నటించి బాగా మెప్పించారు.
బాపు డైరెక్షన్ లో తెరకెక్కిన సీతా కళ్యాణం అనే మరో సినిమాలో జయప్రద సీత పాత్రలో అద్భుతంగా నటించింది.. శ్రీరామరాజ్యం సినిమాలో నయనతార సీత పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడం విశేషం . సీతారామ కళ్యాణం సినిమాలో సీత పాత్రలో గీతాంజలి నటించి మెప్పించింది.. శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో సీత పాత్రలో సంగీత నటించగా, దేవుళ్లు సినిమాలో లయ అలాగే శ్రీరామదాసు సినిమాలో అర్చన సీత పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: