ట్రైలర్: బిచ్చగాడు-2 అదరగొట్టేస్తున్న ట్రైలర్..!!

Divya
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన చిత్రం బిచ్చగాడు. ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం గా నిలిచింది. 2016లో సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం మళ్లీ ఇన్ని సంవత్సరాలకు సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ట్రైలర్ ని ఈ రోజున చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో విజయ్ ఆంటోని చాలా పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లుగా  కనిపిస్తోంది.

ఈ ట్రైలర్ విజయ్  గురుమూర్తి ఇండియాలోనే సెవెంత్ రిచెస్ట్ మ్యాన్ అంటూ చెప్పే వాయిస్ తో మొదలవుతుంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని అయ్యప్ప మాలలో కూడా కనిపిస్తూ ఉన్నారు. బిచ్చగాడు మొదటి భాగం తల్లిప్రాణాలు కాపాడుకునేందుకు వ్యాపారవేత్త స్వామీజీ సలహాతో 40 రోజులపాటు బిచ్చగాడుగా మారుతారు.. అయితే పార్టీలో మాత్రం విజయ్ ఆంటోని ఒక గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ చిత్రాన్ని మే 19వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా విజయ్ తో పాటు కావ్య దాపర్ యోగి బాబు ,విజయ్ దేవ్ గిల్ నటించనున్నారు. బిచ్చగాడు-2 సీక్వెల్ ముందు మెట్రోలాంటి సూపర్ హిట్ అందించిన ప్రియ కృష్ణకుమారి దర్శకత్వం వహించాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఆయన తప్పుకోవడంతో విజయ్ ఆంటోనీ నే ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది. మరి ఏ మేరకు ఈ సినిమా విజయ్ ఆంటోనీ కెరీర్ కు మలుపు తిరుగుతుందో చూడాలి మరి. విజయ్ ఆంటోని గతంలో కూడా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: