"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ టీజర్ విడుదల టైమ్ ను ప్రకటించిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ తో అద్భుతమైన విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని సూపర్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఆ తరువాత నవీన్ ... అనుదీప్ కే వీ దర్శకత్వంలో రూపొందిన జాతి రత్నాలు అనే కామెడీ ప్రాధాన్యత కలిగిన సినిమాలో హీరో గా నటించాడు.

 ఈ మూవీ కూడా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో నవీన్ పోలిశెట్టి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అమాంతం పెరిగి పోయింది. తాజాగా నవీన్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు పి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నిన్న ఈ సినిమా యూనిట్ ఈ మూవీ నుండి టీజర్ ను ఈ రోజు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం మనకు తెలిసింది.

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క టీజర్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ని మే 26 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ... ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: