"ఏజెంట్" మూవీకి 1వ రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
అక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ అనే స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ లో మలయాళ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటించగా ...  ఈ సినిమాకు హిప్ హప్ తమిజ సంగీతం అందించాడు.

 ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ మూవీ ని నిర్మించగా ... సాక్షి వైద్య ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా నిన్న అనగా ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో మంచి అంచనాల నడుమ భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లని బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిందో తెలుసుకుందాం.
మొదటి రోజు ఈ మూవీ నైజాం ఏరియాలో 1.33 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ,  సీడెడ్ లో 64 లక్షలు ,  యూ ఏ లో 54 లక్షలు ,  ఈస్ట్ లో 29 లక్షలు , వేస్ట్ లో 30 లక్షలు ,  గుంటూరు లో 52 లక్షలు ,  కృష్ణ లో 22 లక్షలు ,  నెల్లూరు లో 16 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4 కోట్ల షేర్ ... 6.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ మొదటి రోజు 30 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా ... ఓవర్ సీస్ లో ఈ మూవీ మొదటి రోజు 65 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.95 కోట్ల షేర్ ... 8.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: