రజిని మూవీలో సూర్య..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న జైలర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ యొక్క షూటింగ్ ను మరి కొన్ని రోజుల్లోనే ఈ చిత్ర బృందం పూర్తి చేసి ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించ బోతున్నట్లు తెలుస్తోంది .

 ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత రజిని "జై భీమ్" మూవీ కి దర్శకత్వం వహించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న టీ జీ జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. జైలర్ మూవీ షూటింగ్ అనంతరం రజిని ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... రజిని ... జ్ఞానవేల్ కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ లో సూర్య ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ... సూర్య పాత్ర నిడివి ఈ సినిమాలో తక్కువే అయినప్పటికీ సూర్య పాత్ర ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే జ్ఞానవేలు దర్శకత్వంలో రూపొందిన జై భీమ్ సినిమాలో సూర్య హీరో గా నటించి అద్భుతమైన ప్రశంశాలను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: