పదేళ్ల తర్వాత వెంకీ సినిమాలో ఆండ్రియా..!!

Divya
విక్టరీ వెంకటేష్ హీరోగా డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రాబోతున్న చిత్రం సైంధవ. ఈ చిత్రం వెంకటేష్ కెరియర్ లోనే 75వ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. గత నెలలో ప్రారంభమైన ఈ చిత్రం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రం హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ కూడా ఇటీవల పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వెంకీ పక్కన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నది. అలాగే మరొక నటి ఆండ్రియా జేరోమియా కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈమె 10 ఏళ్లకు తరువాత వెంకీ చిత్రంలో కనిపించబోతోంది గతంలో తడాఖా సినిమాలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా సైంధవ సినిమాతో మళ్ళీ కనిపించబోతోంది. జాస్మిన్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది.. ఈ పోస్టర్ విషయానికి వస్తే ఆండ్రియా గన్ చేత పట్టుకొని బైక్ బై చాల స్టైలిష్ గా కూర్చున్నట్లు తెలుస్తోంది బ్లాక్ కలర్ దుస్తులలో చాలా కోపంగా చూస్తున్నట్లు తెలుస్తోంది. 2005లో కాందనాల్ ముదల్  అని తమిళ చిత్రం ద్వారా ఈమె సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
ఆ తర్వాత తెలుగు తమిళ్ మలయాళం వంటి చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. యుగానికి ఒక్కడు సినిమాతో కూడా ప్రేక్షకులను బాగా అలరించింది ఆండ్రియా. సైంధవ చిత్రం కూడా ఒక మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో వెంకటేష్ చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని వెంకి పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని చిత్ర బృందం చాలా ధీమాతో ఉన్నారు ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో విడుదల కాబోతున్నది. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: