ఏజెంట్ రివ్యూ: అఖిల్ కష్టం ఫలించిందా?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ కిడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా సీనియర్ స్టైలిష్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై ఎంటర్ టైనర్ 'ఏజెంట్'. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుంచే మంచి అంచనాలున్నాయి.విడుదలైన టీజర్ ఇంకా ట్రైలర్లు అయితే ఈ సినిమాపై మంచి అంచనాలను నమోదు చేశాయి. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందో తెలుసుకుందాం.సినిమా కథ విషయానికి వస్తే తన చిన్నప్పుడు తన కళ్ళముందే తన స్నేహితులందరూ కూడా బాంబ్ బ్లాస్ట్ లో దారుణంగా చనిపోవడంతో.. ఎలాగైనా ఏజెంట్ కావాలని కలలుగంటూ.. అందుకు తగ్గట్లు ట్రైనింగ్ ని తీసుకుంటూ, రా ఏజెన్సీ చీఫ్ మహదేవ్ (మమ్ముట్టి)ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని బ్రతుకుతుంటాడు రిక్కీ (అఖిల్ అక్కినేని).ఇక ఎట్టకేలకు ఒక సీక్రెట్ మిషిన్ తో రంగంలోకి దిగుతాడు రిక్కీ. ఆ తర్వాత అసలు రిక్కీ ప్రయాణం ఎలా సాగింది? రిక్కీ ఇక తన సత్తాను చాటుకున్నాడా? అనేది ఖచ్చితంగా సినిమా చూసి తెలుసుకోవాలి.


అఖిల్ ఈ మూవీ కోసం పడిన కష్టం ఫస్ట్ లుక్ రిలీజైనప్పటి నుండి అర్ధమైంది. తన లుక్స్ ఇంకా మ్యానరిజమ్స్ విషయంలో కొత్తదనం కోసం పరితపించిన అఖిల్, తన స్థాయికి మించి సినిమాలో ఆకట్టుకునే ప్రయత్నాన్ని చేశాడు. వైల్డ్ ఏజెంట్ గా అఖిల్ నటన, ఫైట్స్ లో ఈజ్ అండ్ యాక్షన్ బ్లాక్స్ లో బిహేవియర్ ఆడియన్స్ ను బాగా అలరిస్తాయి.అయితే మమ్ముట్టి మాత్రం ఆయన మార్క్ ను సినిమాలో చూపించలేకపోయారు. ఆయన పాత్రకి ఉన్న స్క్రీన్ ప్రెజన్స్ ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదు డైరెక్టర్ అండ్ టీం.హీరోయిన్ సాక్షి వైద్య అందంగా కనిపించింది కానీ.. నటిగా మాత్రం ఆమె ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. బాలీవుడ్ నటుడు డినో మోరియా అయితే సూపర్.. ఆయన మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.మ్యూజిక్, ఫోటోగ్రఫీ పర్వాలేదు. అయితే సినిమాని ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే నచ్చుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: