ఏజెంట్ సినిమాలో ఆఫర్.. ఒక పెద్ద స్కాం అనుకున్నా : హీరోయిన్

praveen
అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అనే విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఇక చిత్ర బృందం అందరూ కూడా ప్రమోషన్స్ లో బిజీబిజీగా మారిపోయారు అన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో అటు అఖిల్ స్పై ఏజెంట్గా నటించబోతున్నాడు.

 ఇకపోతే ఏజెంట్ సినిమా ద్వారా సాక్షి వైద్య.. అటు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్.. ఏజెంట్ సినిమా ఆఫర్ వచ్చిన సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏకంగా ఏజెంట్ సినిమా ఆఫర్ వచ్చింది అని తెలిసినప్పుడు ఇది కేవలం ఒక పెద్ద స్కాం మాత్రమే అని అనుకున్నాను అంటూ సాక్షి వైద్య షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను వృత్తి రీత్యా ఫిజియోథెరపిస్టుని కానీ కరోనా సమయంలో ఖాళీగా ఉండడం ఇష్టం లేక సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చేశాను.

 అదృష్టం కొద్దీ ఆ రీల్స్ వైరల్ గా మారిపోయాయ్. అప్పుడు నా స్నేహితుల సలహా మేరకు కొన్ని ఆడిషన్స్ కి కూడా వెళ్లాను. కానీ ఆ తర్వాత అవకాశాలు వచ్చిన ఆ పాత్రలో నచ్చలేదు. ఇక ఏజెంట్ ప్రొడక్షన్ టీం నుంచి ఒకరు ఫోన్ చేసి హీరోయిన్గా ఛాన్స్ గురించి చెప్పారు. అయితే ఈ ఆఫర్ గురించి మొదట్లో నేను నమ్మలేదు. ఇదేదో స్కాం లాగా ఉంది అని భావించాను. కానీ ముంబైలో ఉన్న ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పెద్ద బ్యానర్ అని.. పెద్ద దర్శకుడు.. పెద్ద స్టార్ హీరో అని చెప్పగానే హైదరాబాద్ వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. చివరికి ఈ సినిమాలో సెలెక్ట్ అయ్యాను. ఇక ఏజెంట్ సినిమాతోనే తాను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ సాక్షి వైద్య తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: