గేమ్ ప్లాన్ మార్చుకున్న హరీష్ శంకర్ !

Seetha Sailaja

హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ పై పవన్ కళ్యాణ్ అభిమానులలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. చాలాకాలం తరువాత పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ కలక్షన్స్ రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇలాంటి అంచనాలు ఉన్న ఈ సినిమా కంటే ఇప్పుడు పవన్ అభిమానుల ఆశలు అంచనాలు సుజిత్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ‘ఓజి’ పై విపరీతంగా ఉన్నాయి.

ఈ అంచనాలను మరింత పెంచడానికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా సుజిత్ ఈమూవీ పై మరింత సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈమూవీ షూట్ ఎంతవరకు వచ్చిందో కూడ తెలియకుండా సుజిత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఈవ్యూహాలు హరీష్ శంకర్ దృష్టి వరకు వెళ్ళడంతో అతడు పవన్ తో తీస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వ్యూహాలను మార్చుకున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
లేటెస్ట్ గా ఈమూవీకి సంబంధించిన ఎడిటింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి అంటూ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో లీక్ చేసిన వార్తలను బట్టి ఈమూవీ షూటింగ్ చాలావరకు పూర్తి అయిందా అంటూ సందేహాలు వస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీ షూటింగ్ ఈమధ్యనే ప్రారంభం అయింది. అలాంటి పరిస్థితులలో ఈమూవీ షూట్ కనీసం 25 శాతం కూడ పూర్తి అయ్యే అవకాశం లేదు అని అంటున్నారు.

అలాంటిది అప్పుడే ఎడిటింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి అంటూ హరీష్ శంకర్ ఎందుకు లీకులు ఇచ్చాడు అంటూ పవన్ అభిమానులు ఆశ్చర్యపడుతున్నారు. ఈమధ్య కాలంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై కంటే పవన్ అభిమానులకు ‘ఓజి’ పై ఆశక్తి బాగా పెరిగింది. దీనితో తన మూవీ పై కూడ పవన్ కళ్యాణ్ అభిమానులలో మ్యానియా పెంచడానికి హరీష్ శంకర్ ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: