హరీష్ శంకర్ పై ఇప్పటికీ ఆగని ట్రోల్స్...!!

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ సినిమా ఒప్పుకున్న కూడా అది సెన్సేషన్ అవుతోంది. షూటింగ్ బిగినింగ్ నుంచే ట్రెండ్ బాగా అవుతూ వస్తోంది.
సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటోంది. ప్రస్తుతం పవన్ ఓజీతో పాటు.. ఉస్తాద్ భగత్ సింగ్అనే సినిమా చేస్తున్నాడు ..హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ మూవీ రూపొందుతున్నదని సమాచారం.. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ కావటంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ కాంబోపైనే పడింది. హరీష్ శంకర్ ఈ సినిమా కోసం అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నారని కూడా సమాచారం. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తున్న ఆయన.. సినిమా అప్ డేట్స్ విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లాన్స్ అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసి .. ఓ వీడియో విడుదల చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నట్టు సమాచారం . మే 11న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారని సమాచారం..
 కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఇది కూడా రీమేక్ సినిమా నేనా అన్న అంటూ హరీష్ శంకర్ కి పర్సనల్ గా మెసేజ్ లు పెడుతూ ఆయన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారట అప్పట్లో ఇలానే చేస్తే హరీష్ శంకర్ ఫ్యాన్స్ మీద ఫైర్ అయ్యారు కూడా అయిన కూడా ఆగకుండా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనకి పర్సనల్ మెసేజ్ లు చేస్తున్నట్టు గా సమాచారం.. దాని మీద సినిమా టీమ్ ఇప్పటి వరకు అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు దాంతో కొందరు ఈ సినిమా తేరి సినిమాకి రీమేక్ అని అంటుంటే మరికొందరు మాత్రం ఇది స్ట్రెయిట్ సినిమానే అంటున్నారట.సినిమా యూనిట్ అఫిషియల్ గా అనౌన్స్ చేస్తే కానీ దీనిమీద అందరికీ క్లారిటీ అయితే రాదు... ఇటీవల హైదరాబాద్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసిన మేకర్స్.. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ పనుల్లో ఉన్నారని తెలుస్తుంది.. మైత్రీ మూవీ మేకర్స్  వై రవిశంకర్, నవీన్ యెర్నేని ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారట

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: