సుహాస్ "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" మూవీ మ్యూజిక్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుల్లో ఒకరు అయినటు వంటి యువ నటుడు సుహాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం సుహాస్ "కలర్ ఫోటో" మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

 ఈ మూవీ లో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. కలర్ ఫోటో మూవీ తర్వాత సుహాస్ వరుస మూవీ లలో హీరో గా నటిస్తూ తన కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈ యువ నటుడు రైటర్ పద్మభూషణ్ అనే మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఇలా రైటర్ పద్మభూషణ్ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న సుహాస్ ప్రస్తుతం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. దుశ్యంత్ కటికనేని ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. భలే భలే మగాడివోయ్ ... గీత గోవిందం ... టాక్సీవాలా ... ప్రతిరోజూ పండగే ... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ... 18 పేజెస్ లాంటి అద్భుతమైన మూవీ లను నిర్మించిన జిఏ 2 పిక్చర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క మ్యూజిక్ హక్కులను సోనీ మ్యూజిక్ సంస్థ దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: