విశాల్ "మార్క్ ఆంథోనీ" టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న విశాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశాల్ నటించిన ఎన్నో సినిమాలు ఇప్పటికే తెలుగు లో విడుదల అయ్యాయి. అందులో కొన్ని మూవీ లు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు సాధించడంతో విశాల్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ఉన్న నటుడి గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.
 

ఇది ఇలా ఉంటే తాజాగా విశాల్ "మార్క్ ఆంథోనీ" అనే మూవీ లో హీరో గా నటించాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని మినీ స్టూడియో బ్యానర్ పై వినోద్ కుమార్ నిర్మిస్తుండగా ... జి వి ప్రకాష్ కుమార్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.  సునీల్ , అభినయ , నిళళ్గళ్ రవి ఈ మూవీ లో కీలక పాత్రలలో నటిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్య ఈ మూవీ లో నెగటివ్ రోల్ చేస్తున్నారు.

 కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది  ఈ సినిమా టీజర్ విడుదల తేదీకి సంబంధించిన అధికారిక అనౌన్స్మెంట్ చేసింది. ఈ మూవీ టీజర్ ను ఏప్రిల్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ బృందం ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: