రజినీతో అలాంటి ఎంటర్టైనర్ ను ప్లాన్ చేస్తున్న బాబి..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రజిని "జైలర్" అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రమ్యకృష్ణ ... తమన్నా ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు.

ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇది ఇలా ఉంటే రజిని మరి కొంత కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి బాబీ దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మరి కొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే దర్శకుడు బాబి ... సూపర్ స్టార్ రజనీ కాంత్ తో అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే బాబి తాజాగా చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ తో అదిరిపోయే కమర్షియల్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: