అబ్దుల్ కలాంతో ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందమైన హీరోయిన్ తెలుసా?

praveen
సినీ సెలబ్రిటీలకి  సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. అంతేకాదు నేటిజన్స్ అందరు కూడా ఎప్పుడు హీరో హీరోయిన్ల గురించి ఏదో ఒక వార్తను చూస్తూనే ఉంటారు. అయితే ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండు నడుస్తుంది. అదే త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ స్టార్స్ గా వెలుగొందుతున్న వారి చిన్నప్పటి ఫోటోలు లేదా త్రో బ్యాక్ ఫోటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసి అందులో ఉంది ఎవరబ్బా అని గుర్తు పట్టడం కొంతమందికి కష్టంగానే మారిపోతుంది.

 ఇక ఇలాంటి ఫోటోలు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వగా.. ఇప్పుడు మరో ఫోటో తెర మీదికి వచ్చింది. ఇక ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు అన్న విషయాన్ని మాత్రం దాదాపు ఎవ్వరూ గుర్తుపట్టలేకపోతున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారితో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉండడాన్ని ఈ ఫోటోలో చూడవచ్చు. అయితే ఉత్తరాది అమ్మాయి అయినప్పటికీ తెలుగులో కూడా మంచి సినిమాల్లో నటించింది. సందీప్ కిషన్, నాచురల్ స్టార్ నాని, శర్వానంద్ లాంటి మంచి హీరోలతో ఆడి పాడింది ఈ హీరోయిన్.

 తమన్నా ముందు ఇండస్ట్రీకి వచ్చి మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ కొట్టేసింది కానీ లేదంటే ఈమెనే మిల్కీ బ్యూటీ అనేవారు ప్రేక్షకులు. ముట్టు కుంటే మాసిపోతుందేమో అనేంతలా పాలరాతి శిల్పంలా మెరిసిపోతుంది ఆ బ్యూటీ. ఇంత చెప్పిన తర్వాత కూడా ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టలేకపోయారు కదా. ఆమె పేరు సురభి. తెలుగులో బీరువా సినిమాతో ఇంటర్ ఇచ్చింది. తర్వాత కాలంలో ఎక్స్ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్మెన్, ఒక్కక్షణం,ఓటర్, శశి లాంటి సినిమాల్లో నటించింది. ఇక ఆ తర్వాత మాత్రం అవకాశాలు లేక ఇండస్ట్రీలో కనిపించలేదు. 2021 లో కన్నడ మూవీ అయినా సకత్ లో మెరిసింది ఈ బ్యూటీ. ఇక ప్రజెంట్ అయితే ఈ బ్యూటీ కి సంబంధించి కొత్త ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏమీ లేవు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: