సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోలలో సీనియర్ నటి శరత్ బాబు కూడా ఒకరు. ఏన్నో సినిమాలలో వైవిద్యమైన పాత్రలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పటికే కూడా అడపా దడప్ప సినిమాలలో నటిస్తూ ఉన్నారు శరత్ బాబు.. గడిచిన కొన్ని గంటల క్రితం శరత్ బాబుకు తీవ్ర అస్వస్థత వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన హైదరాబాదులోని AMG ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

బెంగళూరు ఆసుపత్రిలో ఈయన కొంతవరకు కోలుకున్నట్లుగా ఆయన స్నేహితులు సైతం తెలియజేసినట్లు సమాచారం. ఐసీయూ విభాగం నుంచి   శరత్ బాబును మార్చినట్లుగా తెలుస్తోంది. అయితే బెంగళూరు హాస్పిటల్లో ఉండగానే మరొకసారి ఆయనకు తీవ్రమైన అస్వస్థతో ఏర్పడి పరిస్థితి విషమించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో శరత్ బాబును బెంగళూరు నుంచి వెంటనే హైదరాబాదులోని ఏఎంజి హాస్పిటల్కు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరత్ బాబు హైదరాబాదులోనే ఏఎంజి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.

ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలియజేసినట్లు తెలుస్తోంది.ఆరోగ్య పరిస్థితి మెరుగుపరడంతో ఆయనను ఐసీయూ నుంచి జనరల్ రూమ్ కు షిఫ్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దక్షిణాదిలోనే దాదాపుగా ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో భాషలలో నటించారు శరత్ బాబు తెలుగు సినిమాతో మొదలుపెట్టి తమిళ్ కన్నడ మలయాళం వంటి సినిమాలలో కూడా నటించారు శరత్ బాబు. 1973లో తన సినీ కెరీర్లు మొదలుపెట్టిన శరత్ బాబు ఇప్పటివరకు 250 కు పైగా సినిమాలలో నటించి  బాగానే పేరు సంపాదించారు. అయితే తన సహనటి అయిన రమ ప్రభాను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం జరిగింది. శరత్ బాబు సినీ కెరియర్ లో ఉత్తమ సహాయ నటుడుగా నంది పురస్కారాలను కూడా అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: